మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Ranganatha Ashtakam – శ్రీ రంగనాథాష్టకం


ఆనందరూపే నిజబోధరూపే
బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే |
శశాంకరూపే రమణీయరూపే
శ్రీరంగరూపే రమతాం మనో మే || 1 ||

కావేరితీరే కరుణావిలోలే
మందారమూలే ధృతచారుకేలే |
దైత్యాంతకాలేఽఖిలలోకలీలే
శ్రీరంగలీలే రమతాం మనో మే || 2 ||

లక్ష్మీనివాసే జగతాం నివాసే
హృత్పద్మవాసే రవిబింబవాసే |
కృపానివాసే గుణబృందవాసే
శ్రీరంగవాసే రమతాం మనో మే || 3 ||

బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే
ముకుందవంద్యే సురనాథవంద్యే |
వ్యాసాదివంద్యే సనకాదివంద్యే
శ్రీరంగవంద్యే రమతాం మనో మే || 4 ||

బ్రహ్మాధిరాజే గరుడాధిరాజే
వైకుంఠరాజే సురరాజరాజే |
త్రైలోక్యరాజేఽఖిలలోకరాజే
శ్రీరంగరాజే రమతాం మనో మే || 5 ||

అమోఘముద్రే పరిపూర్ణనిద్రే
శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే |
శ్రితైకభద్రే జగదేకనిద్రే
శ్రీరంగభద్రే రమతాం మనో మే || 6 ||

సచిత్రశాయీ భుజగేంద్రశాయీ
నందాంకశాయీ కమలాంకశాయీ |
క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ
శ్రీరంగశాయీ రమతాం మనో మే || 7 ||

ఇదం హి రంగం త్యజతామిహాంగం
పునర్న చాంగం యది చాంగమేతి |
పాణౌ రథాంగం చరణేఽంబు గాంగం
యానే విహంగం శయనే భుజంగమ్ || 8 ||

రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వాన్కామానవాప్నోతి రంగిసాయుజ్యమాప్నుయాత్ || 9 ||

ఇతి శ్రీ రంగనాథాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.